Saturday, April 23, 2011

ఉలికి పిట్ట గారికి ....

ఉలికి పిట్ట ఉరఫ్ ఆకాశ రామన్న(ఏమో లోగుట్టు గౌరీశంకరుడికెరుక) గారికి ....

భలేగా వుంటాది సామి మీ బలాగు.. మీ బలాగు బహు బాగు.. భలే కేలికేస్తారు అందరిని (Sincere appreciation..:) ) ..కాక పొతే బాబయ్యా.. మంచి పలావు తింటూ వుంటే పంటి కింద రాయి లా అనిపించింది ఇది చదివితే ... అదేమిటి సామి ఇట్టా రాసేసారు ? వాకే .. వాకే , పోలికలికి ఏముంది , ఎదవది ఎవరిని ఎట్టా అన్నాపోలిచేయ్యోచ్చు. నరేంద్ర మోడి ని హిట్లరు తో పోల్చోచ్చు.. బాబూ మోహన్ ని మోహన్ బాబుతో పోల్చచ్చు, బెమ్మీ ఇలియానాకీ లైనేయచ్చు
.. పనికి మాలిన పోలికలతో మనకి ఎందుకు లెండి ?

" (ఖర్మరా నాయనా..!! ఈ మేతావుల దృష్టిలో కాలం గుజరాత్ అల్లర్ల వద్దే ఆగిపోయుంటుంది. దాన్ని దాటి ఒక్క క్షణం ముందుకు కూడా రారు :( )
నిజమే, ఒప్పీసుకున్నాం, కానీ బాబు, గుజరాతు మారణకాండ దాదాపుగా దశాబ్ద కాలం నాటిది. దాని తరువాత చాలా మార్పులు జరిగాయి. కానీ, అలాంటి మారణ కాండ మళ్ళీ ఎక్కడా జరగలేదు, గుజరాతుతోసహా. కానీ, .. ఆరుకొట్ల యూదుల్ని జంపేసిన హిట్లరుతో మోడీ బాబుకి పోలికేంది .. ఇది మీరే రాసారా బాబయ్యా ? దశాబ్ద కాలం కిందట జరిగింది పట్టుకుని ఇంకా ఈ మేతావులు వేల్లాడుతున్నారా ? మరే సామి.. ఒక రెండొందలు ఏళ్ల కిందట తెల్లోళ్ళు మన మీద చేసినవి మర్సిపోదామా ? ఓ పాతికేళ్ళ కిందట జరిగిన ఎమర్జెన్సీ మర్సిపోదామా ? దాని తరువాత జరిగిన సిక్కుల ఊచకోత మర్సిపోదామా? అంతెందుకు ? ఒక పదేళ్ళు పొతే ముంబాయి దాడులనే మర్సిపోదాము , ఏమంటారు ?

"చక్కని పాలన అందించే మోడీని అభిమానించే వారిని హిందూత్వవాదులని, అత్యంత ప్రమాదకారులని ఎంత చక్కగా వర్ణిస్తారో." ఇది మరీ కేక.. మాష్టారు.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ! మరి అభివృద్దిపధంలో నడిపించి (నేను జెప్పింది కాదులే శ్రీకృష్ణ కమిటీనే చెప్పిందిగా)అమరుడైన మన మాజీ సీ ఎం అవినీతి మీద రోజుకోటపా ఒదుల్తున్నారుగా మన బలాగుమేతావులు? అభివృద్ధి చేసినంత మాత్రాన .. ఆగంతాలు మర్సిపోతారా ? మరేమో అజ్మల్ కసాబ్ కూడా ఈ మధ్య తెగ మారిపోయ్యాడంటా ! ఆవకాశం ఇస్తే తీహారు జైలు ( అది కాక పొతే ఇంకొకటి ) అభివృద్ది చేసేస్తాడు అంట! ఏటి మనోడిని కూడా పొగిడేసే ఉద్దారకులు ఉండారా ఏంది ?

ఆ .. ఏటంటారు ? మన నరేంద్ర మోడి పత్తేకంగా ఏటి సెయ్యలేదు , కత్తోట్టుకుని ఎవ్వోడిని పోడిసేయ్యలేదు అంటారా ? అలాగే , మంచి పెసనే ! ఆ లెక్కన మన మోడి గారు చేసిన తప్పులేవి లేనట్లే! అంతా అభివృద్దే! మరి మన కిద్వాని బాబాయి ఏటి చేతకాని ముగ్య మంత్రి అంటాడు మోడి గారిని.. అదెక్కడా అంటారా?

మన కిద్వాని బాబయ్య , మశానం మొగం సింగుని పట్టుకుని ఎంత నీతిపరుడు అయితే ఏటి లాభం, వాడి కింద జరిగే అవినీతి ఆపలేనప్పుడు.. అని అన్నాడు గందా! మరి ఆ లెక్కన మన మోడి గారు ఎంత అభివృద్ది కారకుడు , శాంతి కాముకుడు అయినా ఏటి లాభం? వాడి హయాము లో నానా రకాల ఆగంతాలు జరిగినప్పుడు ? అది కూడా ఒక మతస్తుల పైనే ప్రత్యేకం గా జరిగినప్పుడు? కొంపదీసి.. ఏటి.. ఆ మోడి గారిని పొగడడానికి అదే అసలు కారణమా? వోరి మీ అసాధ్యం కూలా !

ఆ అయినా నాకెందుకులే ఉన్నమాటంటే ఉలుకెక్కువ!!!

44 comments:

aggi baraata said...

పై టపా పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. " ప్రమోదవనం " అభిప్రాయం కాదు. సాంఘిక, రాజకీయ, ధార్మిక విషయాలలో మావి భిన్నాభిప్రాయాలు కావచ్చు. కాకపోతే, గౌరవంగా విభేధించడమే మా కామన్ ఎజెండా ! మాలో మేము, మనందరి తోను.. గౌరవంగానే విభేదిస్తాము. అభిప్రాయ భేధాలు వున్నంత మాత్రాన ఇక్కడ filthy hate comments వుండవు.

Anonymous said...

బాబూ మోహన్ ని మోహన్ బాబుతో పోల్చచ్చు, బెమ్మీ ఇలియానాకీ లైనేయచ్చు
మీ జిమ్మడిపోను ఏమన్నా సంబంధం ఉందంట్రా? నరేంద్రమోడీకీ బెమ్మీకీ?

Anonymous said...

well said

Anonymous said...

మోడీని మలంపెంట రౌడీ తో పోల్చనందుకు నా మనోభావాలు హర్ట్‌ అయ్యాయి అద్దెచ్చా!
ఓ లీటరు కిరోసినుంటే ఇవ్వండి అమరుణ్ణైపోతా ..

Csivaajee said...

కామ్రేడ్‌ అగ్గి !!!!

లాల్‌ సలాం సోదరా.... లాల్‌ సలాం ..........

Csivaajee said...

ఇక్కడ బెమ్మీ అనేది మన కామెడీ ఆర్టిస్టు బ్రహ్మానందం అనీ .. మన బ్లాగు సోదరుడు బెమ్మీ కాదని గ్రహించాలి.

Aggi correct me if I am wrong .

aggi baraata said...

@ sivaajee,
మన బెమ్మీ.. ఖళ్ ఖళ్ .. మన బెమ్మీ నరేంద్ర బోడీనా.. ఈళ్ల క్రియేటివిటీ మండి పోను :)

Vijay said...
This comment has been removed by a blog administrator.
Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

బావుంది. మీరు చెప్పిన పోస్టు బహుశా మోడీని సమర్ధించడం కంటే కమ్యూనిస్టులని విమర్శించడానికి ఉద్దేశించినదై ఉండొచ్చు. కాకపోతే, కొద్దిగా అనవసరంగా మోడీ ని సమర్ధించినట్టుగా ఉంది.

Anyway, the author of the original post is the best guy to clarify. Your post rocks...

Anonymous said...

అయ్యబాబోయ్‌, మోడీ ని తిట్టేయడమే, ఇంకేమన్నా ఉందా.
హిందూ ధర్మ వ్యతిరేకులమైపోమూ, కమ్యూనిస్టులమైపోమూ..

Anonymous said...

ఏడిసార్లేరా.. మీ బతుకులకి ఎంచేపూ మోడీ మీదపడి ఏడ్వడమే కానీ మీ ఎర్రసైన్యం దేశానికి చేసిన ఒక్క మంచిపని చెప్పండ్రా.. చూద్దాం.
ముందు ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ అధికారం పుట్టి మునిగేట్టు ఉంది అది చూసుకోండి.

Anonymous said...

వారాంతంగారూ, మీరు చాలా గొప్పోరు సారూ
మాకు కనిపించని మోడీ పొగడ్తలు మీకెలా కనిపించాయబ్బా?

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Csivaajee said...

మీ ఎర్రసైన్యం దేశానికి చేసిన ఒక్క మంచిపని చెప్పండ్రా.. చూద్దాం
------------

అలాగే చెప్తా ..ఓ వారం తర్వాత కనపడు

Anonymous said...

ముస్లింలకు బుద్ధి చెప్పండి
పోలీసులకు మోడి ఆదేశాలు
https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/apr/23/main/23main8&more=2011/apr/23/main/main&date=4/23/2011

Anonymous said...

ప్రమోదవనం అగ్గిబరాటా గారికి..

Anonymous said...

అగ్గిబరాటా ఉలికిపిట్ట..
ఇలా పద్ధతిగా కెలుక్కుని బ్లాగుల్లో ప్రశాంతత కాపాడండిరా బాబూ, మీకు పుణ్యం ఉంటుంది

ఉలికిపిట్ట బ్లాగులో కూడా ఇదే కామెంట్‌ వేద్దామని వెళ్తే అక్కడ కామెంట్లు మూసేశున్నాయి

Anonymous said...

@Anonymous,

Hmm.. previously I disabled the comments. Now you can post. :)

Csivaajee said...

ఉలికిపిట్ట బ్లాగులో నేను రాసిన వ్యాఖ్య, ప్రచురిస్తారో లేదో తెలీదు
ముందుగా రెండు విషయాలు
1- “తుపాకులు పట్టడమే మార్గమని నమ్మే ఎర్రబాబులు”
ఇది ఒక అపోహ, ఒక భయంకరమైన అబద్ధం.
ఆర్ధిక అసమానతలు కనుమరుగైన సమసమాజ స్థాపన కోసం బుల్లెట్‌ ని నమ్ముకున్నది మావోయిజం అయితే. బాలెట్‌ ని నమ్ముకున్నది మార్క్సిజం. ఈరోజుకి, ఈనాటికి ఈ భూస్వామ్య, సూర్జువా పెట్టుబడిదారీ వ్యవస్థపై మార్క్సిజం ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడుతోంది, పోరాడుతుంది.

2- Holycastకాదు holocaust అనాలి.
ఓ కే, మీ వాదన వినిపించాలన్న తొందరలో ఈ స్పెల్లింగ్‌ తప్పు దొర్లి ఉండచ్చు అండర్స్టాండబుల్‌.

దశాబ్దాలుగా కమ్యూనిస్టు భావజాలాన్నీ, సిద్ధాంతాలనీ వారి వారి రాజకీయ స్వ్ప్రయోజనాలకోసం రకరకాలుగా విద విధాలుగా వైనవైనాలుగా మార్చి కూర్చి కుళ్ళబొడిచి జనబాహుళ్యంలోనికి చొప్పించారు.

ఆశయాలని విడిచి సిద్ధాంతాలే కనుమరుగౌతున్న ఈ చారిత్రక నిముషంలోనైనా ఆ భావజాలానికి సమాజంతో ఏర్పడిన ఖాళీని పూడ్చడానికి నడుంబిగించకపోతే అర్ధంలేదు

Csivaajee said...

ఉలికిపిట్ట బ్లాగులో శ్రీనివాస్ వ్యాఖ్యకి నా సమాధానం-
ఈ బ్రేకింగ్ ఇండియా అన్న పుస్తకం గురించి నేనెక్కడా చదవలేదు. ఇదే మొదటిసారి చూడడం, వినడం. ఆ రచయితలు కూడా ఎవరో నాకు తెలీదు. ఆ రిఫెరెన్స్ లింక్ పట్టుకెళ్ళి ఒక్క నిముషం పరిశీలిస్తే నాకళ్ళు రెండు విషయాలు దగ్గర ఆగిపోయిన వి.
1- మొదటి రచయిత-- Rajiv's work argues that the dharma offers a complex and open framework for a genuine dialogue among diverse peoples, rather then a zero sum game
2- రెండవ రచయిత-- He is part of the editorial team of highly popular Tamil web portal www.tamilhindu.com
మొదటి వ్యాఖ్యలో DHARMA నీ రెండవ వ్యాఖ్యలో HINDU నీ అండర్ లైన్ చేసుకోండి. ….ధర్మ, హిందూ .. ధర్మ, హిందూ… ఆ రచయితల సిద్ధాంతం ఏంటో మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటాను.

A little off topic ----------

Somebody please define Dharma for me.
ధర్మ అంటే హైందవవాదమేనా? ఇంకేమీ లేదా? ధర్మ అంటే పదిమంది పెద్దతలకాయలొక దిక్కుకి చేరి తర్మానించింది ధర్మమా?

Anonymous said...

మోడీ ని అభిమానించుకో ఎవరూ వద్దనరు, కానీ మోడీ మా మేనమామ అభిమానించినా తిట్టుకున్నా నాకే హక్కుంది అనకు
............దెబ్బయిపోతావ్‌!!!

ఎర్రచొక్కాని ద్వేషించు నీ అభిప్రాయం అని సర్దుకుపోతాం, అంతే కానీ ఎర్రచొక్కా వేసినోడల్లా ధర్మద్వేషి అని ప్రచారం చేయకు
..........గబ్బైపోతావ్‌‌ !!!

ధర్మాన్ని రక్షించు కానీ ధర్మరక్షణ అన్న సాకుని అడ్డుపెట్టుకుని నువ్వు ఎదగాలని చూడకు ..
ధర్మాన్ని రక్షించు కానీ ధర్మరక్షణ అన్న సాకుని అడ్డుపెట్టుకుని నువ్వు ఎదగాలని చూడకు ..
సర్వనాశనమైపోతావ్‌ !!!!

Anonymous said...

@Anonymous (April 24, 2011 12:17 AM)

మోడీ ని అభిమానించుకో ఎవరూ వద్దనరు, కానీ మోడీ మా మేనమామ అభిమానించినా తిట్టుకున్నా నాకే హక్కుంది అనకు

మీరు అభిమానించినా, ద్వేషించినా నేను చెప్పాల్సింది మాత్రం తప్పకుండా చెబుతాను. దెబ్బైపోతానా.. ఫర్వాలేదు తట్టుకోగలను.

ఎర్రచొక్కాని ద్వేషించు నీ అభిప్రాయం అని సర్దుకుపోతాం, అంతే కానీ ఎర్రచొక్కా వేసినోడల్లా ధర్మద్వేషి అని ప్రచారం చేయకు

నాకు హిందూ ధర్మం కాపాడాలన్న యావ లేదు. బహుషా నేను నమ్మిన వాటిని ఎవరన్నా విమర్శించినప్పుడు రియాక్టయ్యుండవచ్చు. అంటే నువ్వు నమ్మింది అంత గొప్పదా అని అడక్కండి. గొప్పవయినా కాకపోయినా నా బ్లాగు నేను నమ్మింది రాయడం కోసమే గదా.దానిపై మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చాలనుకుంటే.. You are always welcome. దీని వల్ల నేను గబ్బైపోతే.. ఫర్వాలేదు భరించగలను.

Anonymous said...

@Csivaajee,

మీరు, క్రిష్ణ అడిగిన వాటికి (నా బ్లాగులో) తప్పకుండా సమాధానమిస్తాను. దాన్ని ఏదో కామెంట్ల రూపములో కాకుండా .. కొన్ని రోజుల తరువాత (After May 10) టపాల రూపములోనే నేను వామ పక్ష భావజాలన్ని ఎందుకు విమర్సిస్తానో తెలియ జేస్తాను.

Holycast పదాన్ని సరిదిద్దినందుకు Thanks.

Anonymous said...

ప్రస్తుతం ఇదే విషయం మీద చర్చలు మూడు బ్లాగుల్లో జరుగుతున్నాయి. ఒకటి, నా బ్లాగు ఉలికిపిట్ట, రెండవది ప్రమాదవనం. మూడవది ప్రమోదవనం. మూడింట్లో కామెంట్లో చర్చించుకునే బదులు ఏదో ఒక చోట చర్చించుకుందాం. మీకు అంగీకారమేనా..?

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

లెనిన్ చరిత్ర, మరో పార్శ్వం గూర్చి చరిత్ర కారుల వాదన

లెనిన్ గురించి మరో వ్యాసం.

Csivaajee said...

అన్నాయ్ భరద్వాజా? బాగున్నావా?
ప్రస్తుతానికి ఈ రెచ్చగొట్టుడు అవసరం లేదనుకుంటున్నా.. Sincere request ..Enjoy your Sunday !!!

అకాశ్,
రెడీ చర్చిద్దాం. ఆ వనంలోనూ వద్దు.. ఈ వనంలోనూ వద్దు .. It will be neutral మీ బ్లాగులోనే చర్చిద్దాం.

అయితే ఒకటి ..

This is my mortal & individual ideology and need not necessary that my teammates subscribe to this.

ఇంకో విషయం ఏంటంటే—I am not ready for this yet, I am very tied-up … need to complete some reading .. let me comeback to you … let me comeback stronger ..

ఈ లోపు ఒక అజెండా నిర్దేశిద్దామా?

Anonymous said...

ఈ లోపు ఒక అజెండా నిర్దేశిద్దామా?

ప్రతిపాతించండి, నచ్చితే తప్పకుండా..!!

Csivaajee said...

How about ???

1) Communism- Religion
2) Communism- Human Rights?

Anonymous said...

I don't have any problem.

But we can extend it to communism and modern society.

Anonymous said...

మాగంటి గాణ్ణి కొంచెం చూడండి,.. చాలా ఎక్కువ చేస్తున్నాడు.

aggi baraata said...

@ ఆకాశ రామన్న / ఉలికిపిట్ట గారు,
ఈ టపాలో అసలు కమ్యూనిస్టుల ప్రస్తావన ఎక్కడ వచ్చింది?
నా పాయింటు , కేవలం దశాబ్ద కాలం క్రితం జరిగిన అల్లర్లని ఇంకా పట్టుకుని వుండటం ఏమిటి అనే మీ ప్రశ్న మీదే! ఆ లెక్కన అయితే మరి స్టాలిన్ , మావో మారణ హోమాలు ( నాకు తెలియదు నిజమెంతో? మీరు చెప్పినదే కోట్ చేస్తున్నా! ) ఎన్ని దశాబ్దాల క్రితం జరిగాయి ?
ఇంకా , అభివృద్ధి చేసినంత మాత్రాన పాపాలు మాసిపోతాయా?

Anonymous said...

@aggi baraata

కమ్యూనిస్టుల ప్రస్తావన మీ టపాలో రాలేదు కానీ, నేను రాసిన టపా కమ్యూనిస్టుల మీదే. మీరు అందులో ఉండే పేరాలు Quote చేయడం వలన వాటి మూలాలు తెలియ జేసేందుకు కమ్యూనిజాన్ని ప్రస్తావించాను. స్తాలిన్ను మర్చిపోగలిగే వారు నరేంద్ర మోడీని ఎందుకు మర్చిపోవడం లేదు అనేదే నా ప్రశ్న కూడా..!!

Anonymous said...

వీళ్ళని ఏమీచేయలేమా?? ఇలా పడి ఉండాల్సిందేనా? ఎన్నాళ్ళు సహించాలి ఈ అధిపత్యాన్ని?

Anonymous said...

ఆకాశరామన్న, Snkr ఒక్కరేనా? :P

Anonymous said...

విషయం మీద వాదించడం చేత కానప్పుడు ఎదుటివాడీ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఎలానూ విషయ పరిఙ్ఞానంతో వారిని ఏమీ చేయలేక వ్యక్తిగత దూషణలకు, Conspiracyలకు దిగుతారు. ఒక్క విషయం చెప్పండి బాస్, మనం కేవలం అంతర్జాలములో మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నేనెవరో, మీరెవరో, అసలు మిగిలిన వారెవరో ఎవ్వరికీ తెలీదు. అలాంటిది, మీరు కానీ నేను కానీ, మరెవ్వరైనా కానీ ఏమి చేయగలం?

బూతులు తిడతారా, లింకులుపెట్టి ఛండాలపు రాతలు రాస్తారా? ఏంచేసినా ఎదుటివాడు దులుపుకుని పోతాడు, లేదంటే ఈ బ్లాగుకు రావడం మానేస్తాడు. అంతే. ఈ మాత్రం దానికి ఇంతింత పెద్ద పెద్ద మాటలెందుకు?

Csivaajee said...

హలో హలో Aaaksh!!
కూల్‌ డౌన్‌ .. అది ఎవడో అఙ్ఞాత రాసింది. కన్ను ఒక్క అంగుళం పైకెత్తితే ఎవడో వచ్చి మా మామీద కూడా ఏమి రాసిపోయాడో కనిపిస్తుంది. దాన్ని ఖండిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదనుకుంటాను.

సైద్ధాంతిక విభేదాలు తప్ప లింకులూ అసభ్యరాతలూ ఈ బ్లాగులో మీకు కనపడవు. ఒక్కసారి తిరిగి చూసుకోండి. ఎవరంతగా రెచ్చగొట్టినా ఈరోజుదాకా కూల్‌ గానే ఉన్నాం, రేపటి సంగతి మరి ఇంక తెలీదు.

అయినా సరే, ఆ కామెంట్ల వల్ల మీకు కష్టం కలిగింది అంటే, మన:పూర్వకంగా సారీ చెప్తున్నాను. రెండు నిముషాలు ఆగి అవి తొలగించాక ఒక స్మైలీ ఇచ్చి వెళ్ళమని వేడుకొంటున్నాను. .

Csivaajee said...

మా బ్లాగులో మా మీద రాసే అఙ్ఞాత కామెంట్లకే దిక్కులేదు. ఇగ మిగతావేమి ఖండిస్తాం సారూ !!!
అయినా మీరు భలే వాళ్ళు మాస్టారూ.

ఈ ప్రపంచంలో ఏ మాత్రం విశ్వశనీయతలేని --

ABN ఆంధ్రజ్యోతి కధనాల్నీ,
బ్లాగుల్లో రాసే అఙ్ఞాత కామెంట్లనీ,
మన పేటరౌడీ గారి టపాల్నీ...

పట్టించుకుని మనశ్శాంతి చెడగొట్టుకుంటామా చెప్పండి.

Csivaajee said...

Aakaash!!!
If you can throw a smily at this, my rest of the day will be made :)

Anonymous said...

Give a smiley Akaash rao. Shivaji looks sensible unlike most of the crazy communists.

Csivaajee said...

Good, your desparate attempt to Tag Sivajee as a communist has been noticed and appluaded.
చపట్లు ...

Anonymous said...

పేటరౌడీ గారి looooolllllని పట్టించుకుంటున్నారో లేదో వివరం చెప్పాలి ఇప్పుడు...

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

@Csivaajee,

నేను రాసింది కూడా అఙ్ఞాతను ఉద్దేశించే నండీ. ఎందుకంటే, అతను నేనూ మరో వ్యక్తి ఒకరే అంటూ విచిత్రమైన వ్యాఖ్య ఒకటి చేశాడు అందుకే.

మిమ్మల్ని చాలా సేపు Wait చేయించాను, Sorry for that. ఆ వ్యక్తి వ్యాఖ్యల వల్ల నేను బాధపడకపోయినా, మీరు స్పందించిన తీరుకు మాత్రం సంతోషిస్తున్నాను. :)