Friday, August 3, 2012

మమతానురాగాల శాఖా చంక్రమణం !!!

ఈ కధ ఇక్కడితో ఆగిపోయిందా ? 
లేదేమో 
ఇప్పుడు ఈ తాత కి ఆమె మనవరాలు 
కొన్నేళ్ళ తర్వాత ఇదే గోదావరి ఒడ్డున 
ఈ సీతకే మనవడిగా ఆ తాత గారు 
ఆడుకుంటూ ఉండచ్చు
మమతానురాగాల శాఖా చంక్రమణం 
అక్కడ ప్రవహిస్తున్న గోదావరిలాగానే
ఎక్కడో సంసార సాగరం లో కలిసి 
సంతోష మేఘాలు గా ఎగసి 
అనురాగ వర్షం గా కురిసి 
జీవనది గా వెలసి తిరిగి సాగరం లో కలిసి 
మేఘాలు గా ఎగసి 
నిరంతరం గా తరం తరం గా 
హైందవ కుటుంబ జీవన ఔన్నత్యానికి 
అద్దం  పడుతోంది .............

రెండు రోజులు ముందు శెలవుతీసుకున్న అమ్మని .. కళ్ళతో చూసుకుని .. చేతుల్తో ఎత్తుకుని.. పాపాయి నవ్వుల్లో ఎన్నో ప్రశ్నలకి సమాధానాల్ని వెతుక్కుంటూ మౌనంగా మురిసిపోతున్న ....

...నా తమ్ముడికి అంకితం ..

Wednesday, November 23, 2011

హాపీ బర్త్‌ డే ప్రమోదవనం

నవంబరు 23 ప్రమోదవనం మొదటి పుట్టిన రోజు. మమ్మల్ని అభిమానించి ఆదరించిన తెలుగు బ్లాగర్లందరికీ కృతఙ్ఞతలు.

Thursday, June 23, 2011

రాయల్‌ రంబుల్‌- Part 2

మలక్‌ అన్నాయ్‌ "రాయల్‌ రంబుల్‌- Part 1" తో పూర్తిగా ఏకీభవిస్తున్నా!

ఎవడు ఎవణ్ణి కెలుకుతున్నాడో అర్ధం కాని ఓరకమైన విచిత్ర పరిస్థితి వచ్చిపడింది. ఓ నెలరోజులుగా బ్లాగులని అప్పుడప్పుడూ చదవడమే కాని ఎక్కడా Contribute చేయలేదు, కానీ రోజుకో పది మైళ్ళు వచ్చిపడుతున్నాయి. మన కులాన్ని కెలుకుతున్నారని, మన వనాన్ని కెలుకుతున్నారని, మన ప్రాంతాన్ని కెలుకుతున్నారని, మన భాషని కెలుకుతున్నారని.....

ఇవ్వన్నీ ఒకెత్తు అయితే నిన్న ప్రవీణ్‌ అన్నాయ్‌ మైల్‌ పెట్టి " బ్లాగుల్లో ఎవరో నువ్వు చౌదరి అని అంటున్నారు, నువ్వు ఖండించడం లేదు, నువ్వు నిజంగా చౌదరివే అయితే నేను నీతో ఈ జన్మలో మాట్టాడ" అన్నాడు.

పోనీ కెలుక్కుంటే కున్నారు గానీ, నేను ఎవరి పార్టీనో చెప్పి తర్వాత కెలుక్కోండిరాబాబు. నన్ను ఏ వర్గంలో వేశారో నాకే అర్ధం కావట్లా, ఒకడొచ్చి కులగజ్జి కమ్మా అంటాడు, ఒకడొచ్చి కులం లేని కమ్యూనిస్టు అంటాడు.. ఎవరివైపు మాట్లాడాలి నేను???

మొత్తానికి నా ఆశ నెరవేరింది. బ్లాగు గొడవల్లో భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లుతోంది, ఒక బ్లాగు గొడవలో బద్ధ శత్రువులు మరో బ్లాగు గొడవలో మిత్రులైయ్యారు. For a change, this is also good !

Keep rocking !! Cheers !