Friday, August 3, 2012

మమతానురాగాల శాఖా చంక్రమణం !!!

ఈ కధ ఇక్కడితో ఆగిపోయిందా ? 
లేదేమో 
ఇప్పుడు ఈ తాత కి ఆమె మనవరాలు 
కొన్నేళ్ళ తర్వాత ఇదే గోదావరి ఒడ్డున 
ఈ సీతకే మనవడిగా ఆ తాత గారు 
ఆడుకుంటూ ఉండచ్చు
మమతానురాగాల శాఖా చంక్రమణం 
అక్కడ ప్రవహిస్తున్న గోదావరిలాగానే
ఎక్కడో సంసార సాగరం లో కలిసి 
సంతోష మేఘాలు గా ఎగసి 
అనురాగ వర్షం గా కురిసి 
జీవనది గా వెలసి తిరిగి సాగరం లో కలిసి 
మేఘాలు గా ఎగసి 
నిరంతరం గా తరం తరం గా 
హైందవ కుటుంబ జీవన ఔన్నత్యానికి 
అద్దం  పడుతోంది .............

రెండు రోజులు ముందు శెలవుతీసుకున్న అమ్మని .. కళ్ళతో చూసుకుని .. చేతుల్తో ఎత్తుకుని.. పాపాయి నవ్వుల్లో ఎన్నో ప్రశ్నలకి సమాధానాల్ని వెతుక్కుంటూ మౌనంగా మురిసిపోతున్న ....

...నా తమ్ముడికి అంకితం ..

1 comment:

Anonymous said...

Good to hear the developments