Wednesday, November 23, 2011

హాపీ బర్త్‌ డే ప్రమోదవనం

నవంబరు 23 ప్రమోదవనం మొదటి పుట్టిన రోజు. మమ్మల్ని అభిమానించి ఆదరించిన తెలుగు బ్లాగర్లందరికీ కృతఙ్ఞతలు.

Thursday, June 23, 2011

రాయల్‌ రంబుల్‌- Part 2

మలక్‌ అన్నాయ్‌ "రాయల్‌ రంబుల్‌- Part 1" తో పూర్తిగా ఏకీభవిస్తున్నా!

ఎవడు ఎవణ్ణి కెలుకుతున్నాడో అర్ధం కాని ఓరకమైన విచిత్ర పరిస్థితి వచ్చిపడింది. ఓ నెలరోజులుగా బ్లాగులని అప్పుడప్పుడూ చదవడమే కాని ఎక్కడా Contribute చేయలేదు, కానీ రోజుకో పది మైళ్ళు వచ్చిపడుతున్నాయి. మన కులాన్ని కెలుకుతున్నారని, మన వనాన్ని కెలుకుతున్నారని, మన ప్రాంతాన్ని కెలుకుతున్నారని, మన భాషని కెలుకుతున్నారని.....

ఇవ్వన్నీ ఒకెత్తు అయితే నిన్న ప్రవీణ్‌ అన్నాయ్‌ మైల్‌ పెట్టి " బ్లాగుల్లో ఎవరో నువ్వు చౌదరి అని అంటున్నారు, నువ్వు ఖండించడం లేదు, నువ్వు నిజంగా చౌదరివే అయితే నేను నీతో ఈ జన్మలో మాట్టాడ" అన్నాడు.

పోనీ కెలుక్కుంటే కున్నారు గానీ, నేను ఎవరి పార్టీనో చెప్పి తర్వాత కెలుక్కోండిరాబాబు. నన్ను ఏ వర్గంలో వేశారో నాకే అర్ధం కావట్లా, ఒకడొచ్చి కులగజ్జి కమ్మా అంటాడు, ఒకడొచ్చి కులం లేని కమ్యూనిస్టు అంటాడు.. ఎవరివైపు మాట్లాడాలి నేను???

మొత్తానికి నా ఆశ నెరవేరింది. బ్లాగు గొడవల్లో భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లుతోంది, ఒక బ్లాగు గొడవలో బద్ధ శత్రువులు మరో బ్లాగు గొడవలో మిత్రులైయ్యారు. For a change, this is also good !

Keep rocking !! Cheers !

Tuesday, May 10, 2011

అనిల్‌ రాయల్‌ గారి మూడో వసంతం సందర్భంగా!!!

మన తెలు-గోడు బ్లాగరు, అనిల్‌ రాయల్‌ గారి బ్లాగు ప్రస్థానంలో మూడో వసంతం సందర్భంగా వెలువరించిన ఒక అభిప్రాయం.

బ్లాగుల్లో రెండు మూడేళ్ల కిందున్నంత ఆరోగ్యకరమైన వాతావరణం (ఇదో సాపేక్ష పదం) ఇప్పుడు లేదు. అంత ఆసక్తికరమైన టపాలూ ప్రస్తుతం రావటం లేదు. వచ్చినా నా కళ్లబడటం లేదు. మొత్తానికి తెలుగు బ్లాగుల పరిస్థితేం బాగులేదు. బ్లాగులు సాహితీ సేవా కేంద్రాలు కానక్కర్లేదు. బజారు భాషా పరిజ్ఞాన  ప్రదర్శనాంగణాలు కాకుంటే చాలు. అవనే అయ్యాయి. ఇక చేసేదేం లేదు.

ఒక సీనియర్‌ బ్లాగరు కలం నుండీ వెలువడిన ఈ అభిప్రాయం అవశ్యం ఆలోచించదగినది. దీనికి సమష్టిబాధ్యత వహించి పరిస్థితిని మెరుగుపరచడంకోసం అందరూ కలసిరావాలి.

Sunday, May 8, 2011

ఆలోచింపచేసిన ఒక వ్యాఖ్య !!

నన్ను ఆలోచింపచేసిన ఒక వ్యాఖ్య యధాతధంగా, చదివి ఒక్క రెండునిముషాలు ఆలోచించగలిగితే !
ధన్యోస్మి!
------------------------------------------------------------------------------------
ఎవరండీ వీళ్ళు? నా బ్లాగ్‌లో కూడా అడ్డంగా రాస్తున్నారు. ఎంత ఓపిగ్గా రాసినా రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప మామూలుగా రాయడం లేదు. ఇదేం అలవాటు వీళ్ళకి? నేను రెండు సంవత్సరాలనుండి ఇంగ్లీసులో బ్లాగింగ్ చేస్తున్నా. అక్కడ ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాని తెలుగులో బ్లాగు మొదలుపెట్టిన రెండునెలలకే వీళ్ళు వెటకారాలు, హేళన చేయడం, అన్నీ తెలిసినట్లు అధిక్యంతో రాయడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ రోజైతే Snkr అని ఒకరూ, srinivas అని ఇంకొకరూ చాలా అసభ్యంగా రాశారు. నా అభిప్రాయాలు రాసుకుందామని బ్లాగ్ పెట్టుకుని రాసుకుంటున్నా. మీ సోది వినాల్సిందేనా అని ఒకడు, చైనా మీద ఎందుకు రాయవు అని ఇంకొకడు, అదెవరో మార్తాండలాగా అని మరొకడు ఏవేవో రాస్తున్నారు. బ్లాగ్ లో మనకు నచ్చిన అభిప్రాయాలు రాసుకునే స్వేఛ్ఛ ఉంటుంది గదా. దాన్ని గుర్తించకుండా వాళ్ళకి నచ్చింది రాయాలంటారేంటి?

వీళ్ళలో కొంతమంది (లేకపోతే అందరూనో) అమెరికాలో స్ధిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తున్నారు. అంత చదువు చదివి సభ్యతా, సంస్కారం లేకుండా వెకిలి రాతలు రాయడానికి సిగ్గు ఎలా లేదో అర్ధం కావడంలేదు. శాడిజం అని విన్నాం గాని అది ఇంటర్నెట్ లో కూడా తీర్చుకుంటారని తెలిసి చాలా ఆశ్చర్యంగా ఉంది.

గత నెలరోజులనుండి అప్పుడప్పుడు రాస్తూనె ఉన్నారు. నచ్చకపోతే చదవడం మానేయాలి గానీ ఇలా దాడి చేయడం చూస్తే చీదర సరే, ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఏం సాధించాలని ఇదంతా? వీళ్ళ వ్యవహారం నాకసలు అర్ధం కావడం లేదు. వీళ్ళకేం కావాలి?

ముఖ్యంగా అగ్రిగేటర్ అని చెబుతున్న ఓ సైట్ కి నా బ్లాగ్ ఇచ్చిన దగ్గర్నుండీ ఈ కామెంట్లు వస్తున్నాయి. అది గమనించి సైడ్ కాలంలో ఉంచిన వాళ్ళ బేనర్ని తీసేశాను. కాని వాళ్ళ లిస్టులోంచి తీయలేను కదా. తీయమని చెప్పినా వినేట్లు లేరు.

ఇది చాలా ఘోరం. అగ్రిగేటర్ సైట్ అని ప్రకటించి సబ్ మిట్ చేశాక ఇలా సాటి బ్లాగర్లమీద దాడులు చేయడం చాలా ఘోరం. ఈ స్వభావాన్ని ఎలా గుర్తించాలొ అర్ధం కావడం లేదు. ఎవరైన కొత్త వ్యక్తి ఎదురైతే ఎలా మాట్లాడుతాం? గౌరవిస్తూ మాట్లాడుతాం. పరిచయాలు పెరిగి ఫ్రెండ్‌షిప్ అయితే తప్ప అరె ఒరే అనుకోం. స్నేహం కుదిరినా ఒకళ్ళ అభిప్రాయాలు మరొకళ్లకి నచ్చకపోతే అలా కుదరని విషయాలు రాకుండా జాగ్రత్తపడుతూ స్నేహాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం. అసలు అటువంటి మర్యాదలేవీ వీళ్ళకి అవసరం లేదా? ఇలాంటి శాల్తీలు ఎదురుగా తగిలితే నాలుగు పీకుతాం. ఇంటర్నెట్ లో అది కుదరదనేనా వీరి ధైర్యం? అసలటువంటి పరిస్ధితిని తెచ్చి మరీ తిట్టించుకుంటున్నారే వీళ్ళు? ఇలా ఆలోచిస్తున్నకొద్ది ఆశ్చర్యంగా ఉంటోంది. మానవ సమాజానికి సంబంధించిన కనీస నియమాలు పాటించట్లేదు వీళ్ళు. సరే ఏం సాధిస్తారు?

తమిళులు చేసుకున్నంతగా తెలుగు సాఫ్ట్ వేర్ ఎవరూ సరిగా డెవలెప్ చేయలేదని, అందువలన తెలుగు బ్లాగింగ్ అందరికీ అందుబాటులోకి లేకుండా పోయిందనీ కొద్దిగా బాధపడుతుండే వాడ్ని. ఈ సంకలినులు చూశాక సంతోషం వేసింది. ఆ సంతోషంలోనే కనబడిన అగ్రిగేటర్ లన్నింటికీ నా బ్లాగ్ పేరు ఇచ్చేశా. తీరా చూస్తే వెటకారాలు, ఎగతాళి వగైరాలు. టెక్నాలజీని మంచిని పెంచడానికీ, మనకు తెలిసిందాన్ని నలుగురికీ పంచడానికీ వినియోగించుకోవాలి గానీ ఇలా లేని శతృత్వం పెంచుకోవడానికి ఉపయోగించుకోవడం ఒక విధంగా బాధగా ఉంది. అపాత్రదానం అన్నట్లు అర్హత లేని వారికి సాఫ్ట్ వేర్ విద్య అందిందే అనుకోండి. ఇలా దుర్వినియోగం చేయడమేనా? ఇక్కడ ప్రజల డబ్బుతోనే చదువులన్నీ చదువుకుంటున్నాం. ప్రజల డబ్బు అని అంగీకరించకపోతే కనీసం తల్లిదండుల డబ్బుతోనైనా అని అంగీకరిస్తారు కదా? అలా చదువుకుని విజ్ఞానాన్ని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారే వీళ్ళు?

విశేఖర్
teluguvartalu.wordpress.com
------------------------------------------------------------------------------------

Sunday, May 1, 2011

మలక్‌, Here you go !!!

బ్లాగుల్లో తిరిగే ప్రతీ 'ఎనోన్‌' మక శిఖండి క్లైములనీ ఖండించే అలవాటు నాకులేదులే గానీ.....భరద్వాజా ..

ఏమూలో నీలోనూ కూసింత మానవత్వం (ముతక భాషలో చెప్పాలంటే చీమూ నెత్తురూ) మిగిలి ఉంటుందనే నమ్మకం తో నీకు సమాధానమిస్తున్నా ..

జీవితంలో దేనికీ పనికిరాని మీ పదిమంది హిందూద్వేషులు ఒక బ్లాగు పెట్టుకోవచ్చుగానీ మిగిలినవాళ్ళు సంకలిని పెట్టుకోకుడదా?

నేను పనికొస్తానా రానా తర్వాతి సంగతి. నన్ను హిందూద్వేషిగా ముద్రవేసేసినప్పుడు, నిన్ను పరమత ద్వేషిగా నీకు నువ్వు ముద్రవేసుకుని నిరభ్యంతరంగా పెట్టుకో ఎన్ని కావాలంటే అన్ని సంకలునులు

ఎంతైయా పాపం మీ ప్రమోదవనం ఏడుపంతా మాలిక మీదే కదా? ... మీ crybabies అందరి ఏడుపు వల్ల మాకు లాభమే :))

ఏముందక్కడ ఏడ్వడానికి? నీమాటవినని ప్రతీ బ్లాగుమీదా  అందరిబదులూ నువ్వే పడిఏడుస్తూ పీకిపారేస్తున్నావుగా ..

పాపం మమ్మల్ని హిందుత్వ వాదులన్నారు - పనిచెయ్యలేదు
ఎక్కడా? ఆ కామెంటులో హిందూత్వమీద నిబద్ధత లేని వాళ్ళు అని చదివినట్లు గుర్తు

పాపం బజ్ రంగ్ దళ్ అన్నారు - బజ్జుల్లో కూడా లేకుండా పోయారు
ఎవరన్నారు ఎక్కడ?? సంబంధంలేని సంఘాలని కోట్‌ చేసే అలవాటు మాకులేదు, బ్లాగులకే సమయం చాలట్లేదు ఇంకా బజ్జుల్లోకి దిగాలా అని మా టీంలో డిబేట్‌ అవుతూ ఉంటుంది. ఇప్పటిదాకా దిగలేదు కానీ ఒకసారి దిగాక లేకుండా ఎందుకుపోతాం అన్నాయ్‌. నచ్చనప్పుడు పీకేయడానికి అదేమీ చాలిక కాదుగా

గోల గేంగ్ అన్నారు - ఊహూ!
అన్నాం ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం

మా కుటుంబ సభ్యుల మీద బూతులు రాశారు - అది కూడా బెడిసికొట్టింది
అబద్ధం, ఎక్కడా? అయినా మన .. పేరెందుకులే గారి... కన్నా కుటుంబ సభ్యులని బూతులు తిట్టడం లో నైపుణ్యం ఎవరికుంది?

పాపం ఇప్పుడు మేము కుహానా హిందుత్వ వాదులమా?
నువ్వు ఏమయితే ఎవడికేందాయ్‌? హిందూత్వం పేరుచెప్పి ఆధిపత్యపోరుకి దిగకు చాలు.


ఏమనుకుంటారో అనుకోండి. We are fine with everything. We are what we were, we continue to be what we are. ఇదే కాదు, ఇంకా ఎక్కువ రాస్తాం.. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇలాంటి ఆటల్లో మేం మీకన్నా ఓ రెండాకులు ఎక్కువ చదివినవాళ్లమే. ఇప్పటిదాకా పాపం పీకిందేమీ లేదుగా.

పైగా అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు పీకడానికేమీ లేదు అంటూ చేతకానితనం కప్పి పుచ్చుకోడానికి స్టేట్మెంట్లొకటి

 Ready .. get set go ...

ఇంకో విషయం చెప్తున్నా విను. నువ్వు ఒకటికి వందసార్లన్నా .. వెయ్యి సార్లు గీపెట్టుకున్నా, లక్ష సార్లు ప్రచురించుకున్నా .. నీహారిక మా టీం మెంబరు కాదు. She's never been part of our team.

ఇకపై ఈ ఆరోపణలకి స్పందించడం ఉండదు.

నమస్తే

Tuesday, April 26, 2011

మలక్పేట పెద్ద పాలేరూ ఇది నీకోసం!! post updated with mind boggling comments :)

నీ వయసులో 2/3 వ వతుంది నా వయసు.
నాకూ తెలుగొచ్చు, లేఖిని, బరహ నా దగ్గరా ఉన్నాయ్.
ఆహా ఓహో తానా తందానా అనే భట్రాజు శిఖండుల మాదిరిగా కాకుండా తప్పుచేస్తే మందలించి, మంచిచేస్తే భుజం తట్టే మంచి స్నేహితులున్నారు నాకు.


అన్నిటికీ మించి-- నేనూ మార్గదర్శిలో చేరాను. ఓ బ్లాగు పెట్టుకున్నా ..

నీ తిట్టుకి ఇంకో మూడు అక్షరాలు చేర్చి "**** నాయాలా" అని, ఇదిగో తిట్టాను ఏం పీక్కుంటావో పీక్కో అనడం ఎంతసేపు పడుతుంది నాకు ఒక్కసారి ఆలోచించు? ఎదిరించిన ప్రతీ ఒక్కడికీ యాంటీ హిందూ ముసుగేసి ప్రచారం చేయడం ఎవరికి అర్ధంకాదో ఒకసారి ఆలోచించు.

ఒక్క విషయం మనవిచేస్తా .. బ్లాగు ముఖంగా ..

ఇన్నాళ్ళు ఘడియకోసారి నోరుజారావు. రెండేళ్ళపాటు బ్లాగుల్లో నువ్వు హర్ట్ చేసిన ప్రతీ ఒక్కళ్ళూ నయానో భయానో సైలెంట్ గానే ఉన్నారు కానీ ఎదురు మాట్లాడలేదు.
ఆ సమయం అయిపోయింది ఇంక ..

It’s time to give it back, my dear friend. lets have fun ;)


PS: నీలాగా నీ వెనకాలున్నా XXX లనీ, YYY లనీ పేరుచెప్పి ఎవరెవర్నో లాగే కుసంస్కారం లేదు నాకు. కనీసం మీ ప్రమాదవనం లో నిన్నుతప్ప మరోమనిషిని ఈ టపాద్వారా టార్గెట్ చేయలేదు అని మనవిచేస్తున్నాం.



post updated with mind boggling comments :)

"ఏదో పెద్ద మా చేత కెలుకుడు మానిపిస్తామని భీష్మ ప్రతిజ్ఞలు చేశారుగా? ఏమయింది? మీకంత సీను లేదని ఇప్పటికైనా అర్థమయ్యిందా?"

నీ చేత కెలుకుడు మానిపించడం ఎందుకు బాబూ, అప్పుడప్పుడూ నిన్ను కూడా కెలికితే, సరదాగా ఉంటుంది అందరికీ అని. మీ మోకాలికి అది తట్టలేదా ?
ఒంటి చేతుల చప్పట్లెందుకు చదవలేదా?


>>మీ లీడర్ మార్తాండా, చీబోరికా, మీ వెనకాల ఉన్న బ్లాగు భీష్మాచార్యుల ఆంతి-హిందు ఐడియాలిలానే ఉంటాయి మరి.

వాళ్ళ వెన్నంటి ఎల్లప్పుడూ హచ్ కుక్కపిల్లలా తిరిగేది నువ్వు కదా వెఱ్రి నాగన్నా. మళ్ళొక్కసారి నీ పోస్టులూ కామెంట్లూ చూసుకో, సరేనా పాపాయీ :))

"You guys are born failures and incompetent folks,"

he he he you are success personified. నిజమే మరి, నువ్వు చేసే పోరంబోకు వెధవ పనులు చెయ్యడంలో మేము incompetent. నిజమే :))

ఇది ఇంకా కేకా :)

ఆకాశరామన్న said.

విషయం మీద వాదించడం చేత కానప్పుడు ఎదుటివాడీ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఎలానూ విషయ పరిఙ్ఞానంతో వారిని ఏమీ చేయలేక వ్యక్తిగత దూషణలకు, Conspiracyలకు దిగుతారు.

హహ్హహహా.........

మన బ్లాగ్పేట పెద్ద పాలేరు ఈ కామెంటు చూసినట్టున్నాడు.. విషయం వాదించడం ఎట్టాగు రాదు, ఎదుటి వాడి మీద విపరీతమైన కోపం వస్తుంది, తనని మించి ఈ బ్లాగ్లోకంలో వ్యక్తిగత దూషణలకి , కన్‌స్పైరసీలకి దిగే మొనగాడు వున్నాడా? లేదు గందా.. ముందు నోరు పారేసుకున్నాడు , విషయ పరిజ్ఞానం ఎలాగు ఏడిచి చావలేదు. ఇక కన్‌స్పైరసీ..ఈ బ్లాగులో , మొన్నటి టపాలో ఈ రోజు టపాలో ఎక్కడ అన్నా వాడి చాలిక గురించి ఒక్కడనా ఎత్తాడా? ఆడే గొంతు చించుకుని హిందు వ్యతిరేకులు, కమ్యూనిస్టులు , చాలిక మీద బురద అని గింజుకుంటున్నాడు :)
ఆకాశ రామన్న ... యూ ఆర్ రైటో రైటు. మీ కామెంటు మనోడికి కరెస్టుగా సరిపోయింది

ఇక మన రెడ్ క్లిఫ్ అన్న కంద పద్యం సూపరో సూపర్ :) ఒక లుక్కెయ్యండి :)

గళ్ళలుంగీ మడచి ఖళ్ళు ఖళ్ళున వగచి

పళ్ళూడిన బోసినోట పెళ్ళోయని కళలుచేయ గోళ్ళూడునురా

గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా

వెళ్ళదీయక ఈ లొల్లి ఏల? రెల్లివీధుల తెగబడి గిల్లుడేల


నిను !!!!


వాయించన ఇనుపగుళ్ళు,దొర్లించన చెరకుమళ్ళు

కోయించన పాత బ్లేళ్ళు, కుమ్మించన అడవిలేళ్ళు

పోయించన ఘాటుకల్లు, పులిపించన తీట ఒళ్ళు

జుయి జుయ్యిన ముంచి తేల్చ వేచెన్‌ జలముల్‌

Saturday, April 23, 2011

ఉలికి పిట్ట గారికి ....

ఉలికి పిట్ట ఉరఫ్ ఆకాశ రామన్న(ఏమో లోగుట్టు గౌరీశంకరుడికెరుక) గారికి ....

భలేగా వుంటాది సామి మీ బలాగు.. మీ బలాగు బహు బాగు.. భలే కేలికేస్తారు అందరిని (Sincere appreciation..:) ) ..కాక పొతే బాబయ్యా.. మంచి పలావు తింటూ వుంటే పంటి కింద రాయి లా అనిపించింది ఇది చదివితే ... అదేమిటి సామి ఇట్టా రాసేసారు ? వాకే .. వాకే , పోలికలికి ఏముంది , ఎదవది ఎవరిని ఎట్టా అన్నాపోలిచేయ్యోచ్చు. నరేంద్ర మోడి ని హిట్లరు తో పోల్చోచ్చు.. బాబూ మోహన్ ని మోహన్ బాబుతో పోల్చచ్చు, బెమ్మీ ఇలియానాకీ లైనేయచ్చు
.. పనికి మాలిన పోలికలతో మనకి ఎందుకు లెండి ?

" (ఖర్మరా నాయనా..!! ఈ మేతావుల దృష్టిలో కాలం గుజరాత్ అల్లర్ల వద్దే ఆగిపోయుంటుంది. దాన్ని దాటి ఒక్క క్షణం ముందుకు కూడా రారు :( )
నిజమే, ఒప్పీసుకున్నాం, కానీ బాబు, గుజరాతు మారణకాండ దాదాపుగా దశాబ్ద కాలం నాటిది. దాని తరువాత చాలా మార్పులు జరిగాయి. కానీ, అలాంటి మారణ కాండ మళ్ళీ ఎక్కడా జరగలేదు, గుజరాతుతోసహా. కానీ, .. ఆరుకొట్ల యూదుల్ని జంపేసిన హిట్లరుతో మోడీ బాబుకి పోలికేంది .. ఇది మీరే రాసారా బాబయ్యా ? దశాబ్ద కాలం కిందట జరిగింది పట్టుకుని ఇంకా ఈ మేతావులు వేల్లాడుతున్నారా ? మరే సామి.. ఒక రెండొందలు ఏళ్ల కిందట తెల్లోళ్ళు మన మీద చేసినవి మర్సిపోదామా ? ఓ పాతికేళ్ళ కిందట జరిగిన ఎమర్జెన్సీ మర్సిపోదామా ? దాని తరువాత జరిగిన సిక్కుల ఊచకోత మర్సిపోదామా? అంతెందుకు ? ఒక పదేళ్ళు పొతే ముంబాయి దాడులనే మర్సిపోదాము , ఏమంటారు ?

"చక్కని పాలన అందించే మోడీని అభిమానించే వారిని హిందూత్వవాదులని, అత్యంత ప్రమాదకారులని ఎంత చక్కగా వర్ణిస్తారో." ఇది మరీ కేక.. మాష్టారు.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ! మరి అభివృద్దిపధంలో నడిపించి (నేను జెప్పింది కాదులే శ్రీకృష్ణ కమిటీనే చెప్పిందిగా)అమరుడైన మన మాజీ సీ ఎం అవినీతి మీద రోజుకోటపా ఒదుల్తున్నారుగా మన బలాగుమేతావులు? అభివృద్ధి చేసినంత మాత్రాన .. ఆగంతాలు మర్సిపోతారా ? మరేమో అజ్మల్ కసాబ్ కూడా ఈ మధ్య తెగ మారిపోయ్యాడంటా ! ఆవకాశం ఇస్తే తీహారు జైలు ( అది కాక పొతే ఇంకొకటి ) అభివృద్ది చేసేస్తాడు అంట! ఏటి మనోడిని కూడా పొగిడేసే ఉద్దారకులు ఉండారా ఏంది ?

ఆ .. ఏటంటారు ? మన నరేంద్ర మోడి పత్తేకంగా ఏటి సెయ్యలేదు , కత్తోట్టుకుని ఎవ్వోడిని పోడిసేయ్యలేదు అంటారా ? అలాగే , మంచి పెసనే ! ఆ లెక్కన మన మోడి గారు చేసిన తప్పులేవి లేనట్లే! అంతా అభివృద్దే! మరి మన కిద్వాని బాబాయి ఏటి చేతకాని ముగ్య మంత్రి అంటాడు మోడి గారిని.. అదెక్కడా అంటారా?

మన కిద్వాని బాబయ్య , మశానం మొగం సింగుని పట్టుకుని ఎంత నీతిపరుడు అయితే ఏటి లాభం, వాడి కింద జరిగే అవినీతి ఆపలేనప్పుడు.. అని అన్నాడు గందా! మరి ఆ లెక్కన మన మోడి గారు ఎంత అభివృద్ది కారకుడు , శాంతి కాముకుడు అయినా ఏటి లాభం? వాడి హయాము లో నానా రకాల ఆగంతాలు జరిగినప్పుడు ? అది కూడా ఒక మతస్తుల పైనే ప్రత్యేకం గా జరిగినప్పుడు? కొంపదీసి.. ఏటి.. ఆ మోడి గారిని పొగడడానికి అదే అసలు కారణమా? వోరి మీ అసాధ్యం కూలా !

ఆ అయినా నాకెందుకులే ఉన్నమాటంటే ఉలుకెక్కువ!!!

Wednesday, March 2, 2011

కెలుకుడు- The "Actual" Process Flow by బ్లాగ్పేట పెద్దపాలేరు

యధా ప్రకారం- మన పెద్ద పాలేరు గారు చెప్పిన పది విషయాల్లో ఎనిమిది అబద్ధాలు, ఇంకో రెండు ఆరోపణలు ఉండబట్టి అసలు నిజమేంటో తెలుగు బ్లాగర్లకి అందిద్దామనే ఓ చిన్న ప్రయత్నం ఇది. అంతే కాకుండా, చేతిలో ఉన్న మూడు ఆయుధాలని- 1) సంకలిని, 2) జనాల్లోకి చొచ్చుకొని పోయిన ఫేక్‌ ఐడీలు, 3) గూగుల్‌ గుంపులు, బ్లాగుల్లో ఆధిపత్యం కోసం ఎలా దుర్వినియోగపఱచబడుతున్నాయో తెలిపే ప్రయత్నం.











Friday, February 11, 2011

పిచ్చోడికీ పిచ్చిదానికీ మద్యన పెమోదవనం !!!

ఏందో!!! గోల!!!
అద్వానీలూ మసీదులూ సివంగులూ సిట్టెలుకలూ అంటూ రంకెలేసే పిచ్చిది ఒకామె.
పొద్దుపొద్దుగాల సుఖవిరోచనం గాకపోయినా దీనెనకాల పెమోదవనం కుట్రండాదనే పిచ్చోడొకడు..


ఈ పిచ్చోడికీ పిచ్చిదానికీ మద్యన పెమోదవనమూ, నాబోటి అమాయకపుజనాలూ, మా ఎనకమాల తెలుగు బలాగర్ల సమాజమూ, ఆళ్ళ చదువరులూ, అభిమానులూ, మన్నూ మశాణమూ !!!

నాయాల్ది పరిస్థితి ఎట్టుండాదంటే !!!.

..
...
రచ్చబండ మీటింగ్‌ లో రోశితాత మాదిరి..


PS:ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బీహరిక/చీబోరిక ని సపోర్ట్‌ చేసినట్లుంటుంది. ఆమెని సపోర్ట్‌ చేసేవాళ్ళంతా ఇక్కడ చేరతారు, ఇది కెలుకుడువనం ప్రమోదవనం ఫైట్‌ లా మారుతుంది, తద్వారా చీబోరిక మీద ప్రస్తుతం పెరిగి ఉన్న ద్వేషాన్ని ప్రమోదవనానికి ఆపాదించాలని మలం పెంటోడు వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అవుతుంది కనుక ఇక్కడితో వదిలేస్తున్నాం,మాకు సంబంధంలేని గొడవల్లో ఎవడెంత రెచ్చగొట్టినా రెచ్చిపోయేది లేదు.

PPS: వ్యక్తిగతంగా చీబోరిక వ్యాఖ్యలని నేను ఖండిస్తాను, ఇది కేవలం వ్యక్తిగతం మాత్రమే, ప్రమోదవనం గ్రూపులో తీసుకున్న నిర్ణయం ప్రకారం- కులం, మతం, ప్రాంతం మున్నగు విషయాల్లో మాకొక Common Stance ఉండదు.

PPPS: While, we wish you all the best for your efforts to link all blog controversies to pramodavanm and thereby gain sympathy for your ruthless kelkifying :), we reiterate that we will be unruffled with your chincy stuff.

ధర్మపరిరక్షణ ముసుగులో మనోళ్ళు చేస్తున్న అసలు పనులు ఏమిటంటే ..

మరికొన్నివిషయాలతో తరువాతి టపా
అప్పటిదాకా అమ్మకడుపుచల్లగా అందరికీ మంచి జరగాలి ..

And by the way ....... LoLLLLLLLL :))))

Saturday, January 1, 2011

ఈ కొత్త సంవత్సరంలో.................

తెలుగు బ్లాగు పాఠకులకి, రచయితలకి అందరికీ ప్రమోదవనం తరపున 2011 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. కొత్త సంవత్సరంలో  మీకు మీకుటుంబ సభ్యులకీ రాబోయే సంవత్సరం ఆనందంగా గడవాలని, మీరు తలచిన పనులు నెరవేరాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
మనుషుల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు, కానీ రోజు చివరిలో మనం అందఱమూ బాధ్యతలు, అధికారాలూ, ఆనందాలూ ఆక్రోశాలూ కలిగిఉన్న మనుషులమే! At the end of the Day, each one of us is nothing but, FLESH and BLOOD. సైద్ధాంతిక పరమైన చర్చలూ విభేదాలూ వారివారి వాదన వినిపించుకోవడానికి హాస్య, వ్యంగ్యంతో కూడిన ప్రతివాదనలూ ఏదైనా సమంజసమే శృతిమిచని వరకూ! కానీ ఏనాడు మీ బ్లాగు మొహం చూడని మనుషుల్ని కూడా ఆటవికంగా కెలకడం, మానసికంగా కృంగదీయడానికై పదిమంది కలిసి గ్రూపులు కట్టడం, బ్లాగులు పెట్టడం, సామూహిక దాడి చేయడం వద్దు, కద్దు.
కొత్త సంవత్సరంలోనైనా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందాం. బ్లాగుల్లో ఒక సుహృద్భావ వాతావరణం కలగజేద్దాం. ఒకణ్ణి ఒకళ్ళు ఆటవికంగా హింసిచుకుని ఆనందపడే కిరాయిసంస్కృతి కట్టిపెడదాం. పొద్దున్నే నిద్రలేచి కూడలి, మాలిక, హారం, జల్లెడ, సమూహము, మున్నగు తెలుగు సంకలునులు తెరిచే ముందు "దేవుడా! ఇవాళ ఎవడు మనమీద దాడిచేశాడో వాడికి ఎలా తిప్పికొట్టాలో!" అని కాకుండా "ఇవాళ ఎన్ని మంచి బ్లాగులొచ్చాయో, వార్ని ఎలా అభినందించాలో" అని ఆలోచిస్తూ మనబ్లాగు వీక్షణం’ మొదలుపెడదాం. తెలుగు బ్లాగుల ప్రపంచంలో 10 సంవత్సరాల సీనియర్మొదలుకుని 10 నిముషాల జూనియర్వఱకూ నిర్భయంగా నిర్భీతిగా స్వేచ్చా విహంగంలా విహరించగల ఆనందకరవాతావరణం కలుగజేద్దాం.
కెలుకుడు లేనంత కాలం ఎదురుకెలుకుడు ఉండదు. బ్లాగుపెట్టిన మొదటి రోజునుండి చెప్తున్నాం, ఇప్పుడూ చెప్తాం-"ఇది Reactive Blogging కానీ Proactive Blogging కాదు, ప్రతిదాడే కానీ దాడి కాదు. కొన్ని విలువలకి అనుసరించి బ్లాగుపెట్టాం, రోజుదాకా ఆవిలువలకి కట్టుబడి ఉన్నాం, ఇకముందు కూడా ఉంటాం, ఎవరెన్ని రకాలుగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోలేదు, ఇకముందు కోల్పోం, ధర్మం వెంట నడవకుండా విడువం.
Once again, we wish you a very happy and prosperous new year-2011.