Tuesday, April 26, 2011

మలక్పేట పెద్ద పాలేరూ ఇది నీకోసం!! post updated with mind boggling comments :)

నీ వయసులో 2/3 వ వతుంది నా వయసు.
నాకూ తెలుగొచ్చు, లేఖిని, బరహ నా దగ్గరా ఉన్నాయ్.
ఆహా ఓహో తానా తందానా అనే భట్రాజు శిఖండుల మాదిరిగా కాకుండా తప్పుచేస్తే మందలించి, మంచిచేస్తే భుజం తట్టే మంచి స్నేహితులున్నారు నాకు.


అన్నిటికీ మించి-- నేనూ మార్గదర్శిలో చేరాను. ఓ బ్లాగు పెట్టుకున్నా ..

నీ తిట్టుకి ఇంకో మూడు అక్షరాలు చేర్చి "**** నాయాలా" అని, ఇదిగో తిట్టాను ఏం పీక్కుంటావో పీక్కో అనడం ఎంతసేపు పడుతుంది నాకు ఒక్కసారి ఆలోచించు? ఎదిరించిన ప్రతీ ఒక్కడికీ యాంటీ హిందూ ముసుగేసి ప్రచారం చేయడం ఎవరికి అర్ధంకాదో ఒకసారి ఆలోచించు.

ఒక్క విషయం మనవిచేస్తా .. బ్లాగు ముఖంగా ..

ఇన్నాళ్ళు ఘడియకోసారి నోరుజారావు. రెండేళ్ళపాటు బ్లాగుల్లో నువ్వు హర్ట్ చేసిన ప్రతీ ఒక్కళ్ళూ నయానో భయానో సైలెంట్ గానే ఉన్నారు కానీ ఎదురు మాట్లాడలేదు.
ఆ సమయం అయిపోయింది ఇంక ..

It’s time to give it back, my dear friend. lets have fun ;)


PS: నీలాగా నీ వెనకాలున్నా XXX లనీ, YYY లనీ పేరుచెప్పి ఎవరెవర్నో లాగే కుసంస్కారం లేదు నాకు. కనీసం మీ ప్రమాదవనం లో నిన్నుతప్ప మరోమనిషిని ఈ టపాద్వారా టార్గెట్ చేయలేదు అని మనవిచేస్తున్నాం.



post updated with mind boggling comments :)

"ఏదో పెద్ద మా చేత కెలుకుడు మానిపిస్తామని భీష్మ ప్రతిజ్ఞలు చేశారుగా? ఏమయింది? మీకంత సీను లేదని ఇప్పటికైనా అర్థమయ్యిందా?"

నీ చేత కెలుకుడు మానిపించడం ఎందుకు బాబూ, అప్పుడప్పుడూ నిన్ను కూడా కెలికితే, సరదాగా ఉంటుంది అందరికీ అని. మీ మోకాలికి అది తట్టలేదా ?
ఒంటి చేతుల చప్పట్లెందుకు చదవలేదా?


>>మీ లీడర్ మార్తాండా, చీబోరికా, మీ వెనకాల ఉన్న బ్లాగు భీష్మాచార్యుల ఆంతి-హిందు ఐడియాలిలానే ఉంటాయి మరి.

వాళ్ళ వెన్నంటి ఎల్లప్పుడూ హచ్ కుక్కపిల్లలా తిరిగేది నువ్వు కదా వెఱ్రి నాగన్నా. మళ్ళొక్కసారి నీ పోస్టులూ కామెంట్లూ చూసుకో, సరేనా పాపాయీ :))

"You guys are born failures and incompetent folks,"

he he he you are success personified. నిజమే మరి, నువ్వు చేసే పోరంబోకు వెధవ పనులు చెయ్యడంలో మేము incompetent. నిజమే :))

ఇది ఇంకా కేకా :)

ఆకాశరామన్న said.

విషయం మీద వాదించడం చేత కానప్పుడు ఎదుటివాడీ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఎలానూ విషయ పరిఙ్ఞానంతో వారిని ఏమీ చేయలేక వ్యక్తిగత దూషణలకు, Conspiracyలకు దిగుతారు.

హహ్హహహా.........

మన బ్లాగ్పేట పెద్ద పాలేరు ఈ కామెంటు చూసినట్టున్నాడు.. విషయం వాదించడం ఎట్టాగు రాదు, ఎదుటి వాడి మీద విపరీతమైన కోపం వస్తుంది, తనని మించి ఈ బ్లాగ్లోకంలో వ్యక్తిగత దూషణలకి , కన్‌స్పైరసీలకి దిగే మొనగాడు వున్నాడా? లేదు గందా.. ముందు నోరు పారేసుకున్నాడు , విషయ పరిజ్ఞానం ఎలాగు ఏడిచి చావలేదు. ఇక కన్‌స్పైరసీ..ఈ బ్లాగులో , మొన్నటి టపాలో ఈ రోజు టపాలో ఎక్కడ అన్నా వాడి చాలిక గురించి ఒక్కడనా ఎత్తాడా? ఆడే గొంతు చించుకుని హిందు వ్యతిరేకులు, కమ్యూనిస్టులు , చాలిక మీద బురద అని గింజుకుంటున్నాడు :)
ఆకాశ రామన్న ... యూ ఆర్ రైటో రైటు. మీ కామెంటు మనోడికి కరెస్టుగా సరిపోయింది

ఇక మన రెడ్ క్లిఫ్ అన్న కంద పద్యం సూపరో సూపర్ :) ఒక లుక్కెయ్యండి :)

గళ్ళలుంగీ మడచి ఖళ్ళు ఖళ్ళున వగచి

పళ్ళూడిన బోసినోట పెళ్ళోయని కళలుచేయ గోళ్ళూడునురా

గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా

వెళ్ళదీయక ఈ లొల్లి ఏల? రెల్లివీధుల తెగబడి గిల్లుడేల


నిను !!!!


వాయించన ఇనుపగుళ్ళు,దొర్లించన చెరకుమళ్ళు

కోయించన పాత బ్లేళ్ళు, కుమ్మించన అడవిలేళ్ళు

పోయించన ఘాటుకల్లు, పులిపించన తీట ఒళ్ళు

జుయి జుయ్యిన ముంచి తేల్చ వేచెన్‌ జలముల్‌

Saturday, April 23, 2011

ఉలికి పిట్ట గారికి ....

ఉలికి పిట్ట ఉరఫ్ ఆకాశ రామన్న(ఏమో లోగుట్టు గౌరీశంకరుడికెరుక) గారికి ....

భలేగా వుంటాది సామి మీ బలాగు.. మీ బలాగు బహు బాగు.. భలే కేలికేస్తారు అందరిని (Sincere appreciation..:) ) ..కాక పొతే బాబయ్యా.. మంచి పలావు తింటూ వుంటే పంటి కింద రాయి లా అనిపించింది ఇది చదివితే ... అదేమిటి సామి ఇట్టా రాసేసారు ? వాకే .. వాకే , పోలికలికి ఏముంది , ఎదవది ఎవరిని ఎట్టా అన్నాపోలిచేయ్యోచ్చు. నరేంద్ర మోడి ని హిట్లరు తో పోల్చోచ్చు.. బాబూ మోహన్ ని మోహన్ బాబుతో పోల్చచ్చు, బెమ్మీ ఇలియానాకీ లైనేయచ్చు
.. పనికి మాలిన పోలికలతో మనకి ఎందుకు లెండి ?

" (ఖర్మరా నాయనా..!! ఈ మేతావుల దృష్టిలో కాలం గుజరాత్ అల్లర్ల వద్దే ఆగిపోయుంటుంది. దాన్ని దాటి ఒక్క క్షణం ముందుకు కూడా రారు :( )
నిజమే, ఒప్పీసుకున్నాం, కానీ బాబు, గుజరాతు మారణకాండ దాదాపుగా దశాబ్ద కాలం నాటిది. దాని తరువాత చాలా మార్పులు జరిగాయి. కానీ, అలాంటి మారణ కాండ మళ్ళీ ఎక్కడా జరగలేదు, గుజరాతుతోసహా. కానీ, .. ఆరుకొట్ల యూదుల్ని జంపేసిన హిట్లరుతో మోడీ బాబుకి పోలికేంది .. ఇది మీరే రాసారా బాబయ్యా ? దశాబ్ద కాలం కిందట జరిగింది పట్టుకుని ఇంకా ఈ మేతావులు వేల్లాడుతున్నారా ? మరే సామి.. ఒక రెండొందలు ఏళ్ల కిందట తెల్లోళ్ళు మన మీద చేసినవి మర్సిపోదామా ? ఓ పాతికేళ్ళ కిందట జరిగిన ఎమర్జెన్సీ మర్సిపోదామా ? దాని తరువాత జరిగిన సిక్కుల ఊచకోత మర్సిపోదామా? అంతెందుకు ? ఒక పదేళ్ళు పొతే ముంబాయి దాడులనే మర్సిపోదాము , ఏమంటారు ?

"చక్కని పాలన అందించే మోడీని అభిమానించే వారిని హిందూత్వవాదులని, అత్యంత ప్రమాదకారులని ఎంత చక్కగా వర్ణిస్తారో." ఇది మరీ కేక.. మాష్టారు.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ! మరి అభివృద్దిపధంలో నడిపించి (నేను జెప్పింది కాదులే శ్రీకృష్ణ కమిటీనే చెప్పిందిగా)అమరుడైన మన మాజీ సీ ఎం అవినీతి మీద రోజుకోటపా ఒదుల్తున్నారుగా మన బలాగుమేతావులు? అభివృద్ధి చేసినంత మాత్రాన .. ఆగంతాలు మర్సిపోతారా ? మరేమో అజ్మల్ కసాబ్ కూడా ఈ మధ్య తెగ మారిపోయ్యాడంటా ! ఆవకాశం ఇస్తే తీహారు జైలు ( అది కాక పొతే ఇంకొకటి ) అభివృద్ది చేసేస్తాడు అంట! ఏటి మనోడిని కూడా పొగిడేసే ఉద్దారకులు ఉండారా ఏంది ?

ఆ .. ఏటంటారు ? మన నరేంద్ర మోడి పత్తేకంగా ఏటి సెయ్యలేదు , కత్తోట్టుకుని ఎవ్వోడిని పోడిసేయ్యలేదు అంటారా ? అలాగే , మంచి పెసనే ! ఆ లెక్కన మన మోడి గారు చేసిన తప్పులేవి లేనట్లే! అంతా అభివృద్దే! మరి మన కిద్వాని బాబాయి ఏటి చేతకాని ముగ్య మంత్రి అంటాడు మోడి గారిని.. అదెక్కడా అంటారా?

మన కిద్వాని బాబయ్య , మశానం మొగం సింగుని పట్టుకుని ఎంత నీతిపరుడు అయితే ఏటి లాభం, వాడి కింద జరిగే అవినీతి ఆపలేనప్పుడు.. అని అన్నాడు గందా! మరి ఆ లెక్కన మన మోడి గారు ఎంత అభివృద్ది కారకుడు , శాంతి కాముకుడు అయినా ఏటి లాభం? వాడి హయాము లో నానా రకాల ఆగంతాలు జరిగినప్పుడు ? అది కూడా ఒక మతస్తుల పైనే ప్రత్యేకం గా జరిగినప్పుడు? కొంపదీసి.. ఏటి.. ఆ మోడి గారిని పొగడడానికి అదే అసలు కారణమా? వోరి మీ అసాధ్యం కూలా !

ఆ అయినా నాకెందుకులే ఉన్నమాటంటే ఉలుకెక్కువ!!!