Saturday, January 1, 2011

ఈ కొత్త సంవత్సరంలో.................

తెలుగు బ్లాగు పాఠకులకి, రచయితలకి అందరికీ ప్రమోదవనం తరపున 2011 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. కొత్త సంవత్సరంలో  మీకు మీకుటుంబ సభ్యులకీ రాబోయే సంవత్సరం ఆనందంగా గడవాలని, మీరు తలచిన పనులు నెరవేరాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
మనుషుల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు, కానీ రోజు చివరిలో మనం అందఱమూ బాధ్యతలు, అధికారాలూ, ఆనందాలూ ఆక్రోశాలూ కలిగిఉన్న మనుషులమే! At the end of the Day, each one of us is nothing but, FLESH and BLOOD. సైద్ధాంతిక పరమైన చర్చలూ విభేదాలూ వారివారి వాదన వినిపించుకోవడానికి హాస్య, వ్యంగ్యంతో కూడిన ప్రతివాదనలూ ఏదైనా సమంజసమే శృతిమిచని వరకూ! కానీ ఏనాడు మీ బ్లాగు మొహం చూడని మనుషుల్ని కూడా ఆటవికంగా కెలకడం, మానసికంగా కృంగదీయడానికై పదిమంది కలిసి గ్రూపులు కట్టడం, బ్లాగులు పెట్టడం, సామూహిక దాడి చేయడం వద్దు, కద్దు.
కొత్త సంవత్సరంలోనైనా అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందాం. బ్లాగుల్లో ఒక సుహృద్భావ వాతావరణం కలగజేద్దాం. ఒకణ్ణి ఒకళ్ళు ఆటవికంగా హింసిచుకుని ఆనందపడే కిరాయిసంస్కృతి కట్టిపెడదాం. పొద్దున్నే నిద్రలేచి కూడలి, మాలిక, హారం, జల్లెడ, సమూహము, మున్నగు తెలుగు సంకలునులు తెరిచే ముందు "దేవుడా! ఇవాళ ఎవడు మనమీద దాడిచేశాడో వాడికి ఎలా తిప్పికొట్టాలో!" అని కాకుండా "ఇవాళ ఎన్ని మంచి బ్లాగులొచ్చాయో, వార్ని ఎలా అభినందించాలో" అని ఆలోచిస్తూ మనబ్లాగు వీక్షణం’ మొదలుపెడదాం. తెలుగు బ్లాగుల ప్రపంచంలో 10 సంవత్సరాల సీనియర్మొదలుకుని 10 నిముషాల జూనియర్వఱకూ నిర్భయంగా నిర్భీతిగా స్వేచ్చా విహంగంలా విహరించగల ఆనందకరవాతావరణం కలుగజేద్దాం.
కెలుకుడు లేనంత కాలం ఎదురుకెలుకుడు ఉండదు. బ్లాగుపెట్టిన మొదటి రోజునుండి చెప్తున్నాం, ఇప్పుడూ చెప్తాం-"ఇది Reactive Blogging కానీ Proactive Blogging కాదు, ప్రతిదాడే కానీ దాడి కాదు. కొన్ని విలువలకి అనుసరించి బ్లాగుపెట్టాం, రోజుదాకా ఆవిలువలకి కట్టుబడి ఉన్నాం, ఇకముందు కూడా ఉంటాం, ఎవరెన్ని రకాలుగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోలేదు, ఇకముందు కోల్పోం, ధర్మం వెంట నడవకుండా విడువం.
Once again, we wish you a very happy and prosperous new year-2011.